భోపాల్: క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్‌కు ఒక వ్యక్తి గన్ తెచ్చాడు. మ్యాచ్ మధ్యలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. (Man Fires Gun At Cricket Match) దీంతో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం భయాందోళన చెందారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మల్పూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. రాత్రి వేళ మ్యాచ్ జరుగుతుండగా ఒక యువకుడు రైఫిల్‌తో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. నవ్వుతూ తన తోటి వారితో మాట్లాడాడు. అయితే కాల్పుల శబ్దం విని అక్కడున్న జనం భయాందోళన చెందారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరోసారి ఇలా జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read:
MBBS Admission Scam Busted | బయటపడిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల స్కామ్.. నకిలీ ఎన్నారై పత్రాలతో ప్రవేశాలు
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం
Asaduddin Owaisi | రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా?: అసదుద్దీన్ ఒవైసీ