Heart Attack | భర్త మృతితో భార్య ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే అనంతలోకాలకు
Heart Attack | ఘజియాబాద్ (Ghaziabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కొత్త దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Heart Attack | ఘజియాబాద్ (Ghaziabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కొత్త దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
ఘజియాబాద్ వైశాలి ప్రాంతానికి చెందిన అభిషేక్ (25), అంజలికి గతేడాది నవంబర్ 30న వివాహమైంది. ఈ కొత్త జంట సోమవారం నాడు సరదాగా బయటకు వెళ్లాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు (Delhi Zoo) వెళ్లారు. అక్కడ కాసేపు ఇద్దరూ సరదాగా గడిపారు. అనంతరం కాసేపటికి అభిషేక్‌కి ఛాతిలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డాడు. కాసేపటికి నొప్పి ఎక్కువైంది. దీంతో అంజలి తన స్నేహితులకు ఫోన్ చేసి వారి సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ అభిషేక్‌ను పరీక్షించిన వైద్యులు సఫ్దర్‌జంగ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
వెంటనే అంబులెన్స్‌లో అక్కడికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అభిషేక్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు (Heart Attack) కారణంగా అతడు మృతి చెందినట్లు గుర్తించారు. అదేరోజు రాత్రి 9 గంటలకు అభిషేక్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. అయితే, భర్త మృతిని అంజలి తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో తను ఉంటున్న అపార్ట్మెంట్ ఏడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లి కిందకు దూకేసింది. ఈ ఘటనలో అంజలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అంజలి ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయింది (Shocked Wife Jumps To Death). 24 గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read..
Aadhaar | ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు : ఈసీ క్లారిటీ
Virat Kohli | లండన్ కేఫ్‌లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్
mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

