mohammed shami | స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ (mohammed shami ) ఆసుపత్రిలో చేరారు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో షమీకి తాజాగా ఆపరేషన్ (surgery) జరిగింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
‘మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురుచూస్తుంటాను’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ పెట్టాడు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు షమీ త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో షమీ గాయపడ్డాడు. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. చీలమండ గాయానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవలే బీసీసీఐ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Just had a successful heel operation on my achilles tendon! 👟 Recovery is going to take some time, but looking forward to getting back on my feet. #AchillesRecovery #HeelSurgery #RoadToRecovery pic.twitter.com/LYpzCNyKjS
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) February 26, 2024
Also Read..
Accident | ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టి..
Jan Vishwas Yatra | తేజస్వి జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి.. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మృతి
PM Modi | రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధులు..!