PM Modi | రైతులకు గుడ్న్యూస్.. ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధులు..!
PM Modi | కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేలకోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు.
PM Modi | కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేలకోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.
పథకం కింద 11 మందికిపైగా రైతులకు రూ.3లక్షలకోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి’ రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయం విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 15 విడుదతల్లో నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
అయితే, 16వ విడద సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్ 15న ప్రధాని 15వలో 8వేలకోట్లకుపైగా రైతులకు రూ.18వేల కోట్లు జమ చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ఆవాస్ యోజనను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేస్తారు. దాంతో పాటు మహారాష్ట్రలో రూ.1,300 కోట్లకుపైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

