Maharashtra | గత 11 రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radhakrishnan)ను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ గవర్నర్‌ను కలిసి తమ అభ్యర్థనను వినిపించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంపై గవర్నర్‌కు వివరించనున్నారు.
Maharashtra’s Caretaker CM Eknath Shinde and both former Deputy CMs – Devendra Fadnavis and Ajit Pawar to meet Governor CP Radhakrishnan today at 3 pm.
— ANI (@ANI) December 4, 2024
బుధవారం ఉదయం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో.. సీఎంగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు (డిసెంబర్ 5న) ముంబై ఆజాద్ మైదాన్‌లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతోపాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశాయి. అజిత్ పవార్‌తోపాటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. షిండేకు మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Also Read..
Devendra Fadnavis | మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ప్రమాణం.. అధికారిక ప్రకటన
Sambhal | సంభల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన రాహుల్, ప్రియాంక
Air Pollution | ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం.. మెరుగుపడిన గాలి నాణ్యత