న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైన తరుణంలో యూఏఈలో చిక్కుకొన్న భారతీ యులు ఎట్టకేలకు మంగళ వారం స్వదేశానికి చేరుకున్నారు. ఇందు కోసం తమ విమానాలను చేరుకునేందుకు ఆరు గంటలపాటు ఒమన్‌కు రోడ్డుమార్గంలో ప్రయాణించినట్లు వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రశాతంగా ఉన్నప్పటికీ గల్ఫ్వ్యాప్తంగా గగనతలం మూసివేతతో భయాందోళన వాతావరణం నెలకొందని వారు వర్ణించారు.
ఒమన్‌లో విమాన చార్జీలు హఠాత్తుగా నింగినంటాయని, నాలుగైదు రెట్లు అధిక చార్జీలను ఎయిర్‌లైన్స్ వసూలు చేస్తున్నాయని భారతీయ ప్రయాణికులు వెల్లడించారు. విమాన సర్వీసులలో అస్థిరత కారణంగానే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఒమన్ మీదుగా ముంబై చేరుకున్న దుబాయ్ నివాసి అర్హాన్ తెలిపారు. దుబాయ్‌లో పరిస్థితులు మామూలుగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇండ్ల లోపలే ఉండాలని, భయపడవద్దని తమకు సందేశాలు వచ్చేవని, క్షిపణి దాడులు జరిగినప్పటికీ అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన అన్నారు.