Man died : ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. దాంతో కేదార్నాథ్ మార్గంలో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న ఓ 38 ఏళ్ల భక్తుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. గౌరీకుంద్ సమీపంలోని ఓ కొండ పైనుంచి గుండు దొర్లుకుంటూ వచ్చి యాత్రికుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
యాత్రికుడి మృతి, ఎడతెరపిలేని వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.