ముంబై: మహారాష్ట్రలో ఫేజ్-3 వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఫేజ్-1 వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏండ్లకు పైబడిన వారికి, 45 ఏండ్లకు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేయడం మొదలుపెట్టారు. అనంతరం ఫేజ్-2లో 45 ఏండ్ల వయసు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఫేజ్-3లో 18-44 ఏండ్ల మధ్య వయసు వాళ్లందరీకి టీకాలను ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ డోసులు సమయానికి అందకపోవడంతో పలు కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని నిలిపివేసినా, టీకాలు అందిన కొన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని ఓ టీకా కేంద్రానికి కూడా వ్యాక్సిన్లు వస్తున్నట్లు సమాచారం అందింది. దాంతో టీకా కేంద్రం వద్ద జనం బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తమ కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అక్కడి అధికారులు తెలిపారు.
Maharashtra: Phase 3 vaccination for #COVID19 begins. Visuals from a centre in Nagpur.
— ANI (@ANI) May 1, 2021
An official at the centre says, "We've received update from head office that vaccine will be administered only to people between 18-44 yrs of age today. Their vaccination will begin at 2 pm." pic.twitter.com/t7YCd01mdV
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ