నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ కోర్టులో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఆయన పిటిషన్ వేయగా సదరు కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో తాజాగా యూకే హైకోర్టును ఆశ్రయించారు. తన మానసిక స్థితి సరిగా లేదని, ఈ పరిస్థితుల్లో తనను భారత్‌కు అప్పగిస్తే న్యాయం జరుగదని, అందువల్ల తనను భారత్‌కు అప్పగించవద్దని హైకోర్టును కోరారు.
నీరవ్‌మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.14 వేల కోట్ల మేర మోసం చేశాడు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్కు పారిపోయాడు. ఈ కేసుల విచారణ జరుపుతున్న సీబీఐ అప్పటి నుంచి నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే యూకే హోంశాఖ నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
ప్రస్తుతం నీరవ్ మోదీ బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. తమ దేశంలో బ్యాంకును మోసం చేసి పారిపోయాడంటూ సీబీఐ చేసిన ఫిర్యాదు మేరకు బ్రిటన్ పోలీసులు 2019లో నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం నీరవ్ మోదీ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

