e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News మ‌హిళ‌కు వింత రోగం.. న‌వ్విన ప్ర‌తిసారి నిద్ర‌లోకి..!

మ‌హిళ‌కు వింత రోగం.. న‌వ్విన ప్ర‌తిసారి నిద్ర‌లోకి..!

మ‌హిళ‌కు వింత రోగం.. న‌వ్విన ప్ర‌తిసారి నిద్ర‌లోకి..!

లండ‌న్‌: ఓ మ‌హిళ‌ అత్యంత అరుదైన, వింత‌దైన‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ది. ఆమెను న‌వ్వించిన ప్ర‌తిసారీ అక‌స్మాత్తుగా డీలాప‌డిపోయి నిద్ర‌లోకి జారుకుంటుంది. బ్రిట‌న్‌కు చెందిన‌ బెల్లా కిల్మార్టిన్ అనే 24 ఏండ్ల మ‌హిళ‌కు చిన్నప్ప‌టి నుంచి ఈ వింత స‌మ‌స్య ఉన్న‌ది. ఈ వింతైన నిద్ర స‌మ‌స్య‌ను నార్కోలెప్సీ అంటార‌ని వైద్యులు గుర్తించారు. ప‌గ‌టిపూట వ‌చ్చే మ‌గ‌త నిద్రలా ఇది ఉంటుంద‌ని వారు వెల్ల‌డించారు.

కెటాప్లెక్సీ హెల్త్ కండిష‌న్..!
బెల్లా కిల్మార్టిన్‌కు నార్కోలెప్సీతోపాటు కెటాప్లెక్సీ హెల్త్ కండిష‌న్ కూడా ఉన్న‌ది. దీనివ‌ల్ల నవ్వ‌డం లాంటి బ‌ల‌మైన భావోద్వేగాల‌కు లోనైన‌ప్పుడు ఆమె కండరాలు ఒక్క‌సారిగా బలహీనంగా మారిపోతాయి. దాంతో ఆమెకు వెంట‌నే నిద్ర‌ప‌డుతుంది. ఈ అసాధారణమైన రుగ్మ‌తవ‌ల్ల బెల్లా నైట్ క్లబ్‌లు, ప‌ని ప్ర‌దేశాలేగాక ఆఖ‌రికి స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా కునుకు తీసింది. సంద‌ర్భం ఫన్నీగా ఉంటుందని తాను ముందే ఊహించ‌న‌ప్పుడు డిజార్డ‌ర్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని బెల్లా వివరించారు.

అంతేగాక న‌వ్వ‌డం ద్వారా నిద్ర‌లోకి జారుకున్న‌ప్పుడు త‌నకు స్పృహ ఉంటుంద‌ని, చుట్టూ ఏం జ‌రుగుతుందో కూడా తెలుస్తుంద‌ని, కానీ శ‌రీరాన్ని మాత్రం క‌దిలించ‌లేక‌పోతాన‌ని బెల్లా తెలిపారు. ముందుగా ప‌రీక్ష‌ల ఒత్తిడి కార‌ణంగా త‌న‌లో బ‌ల‌హీన‌త వ‌స్తుంద‌ని భావించేదాన్న‌ని, అయితే 2015లో ఒక స్పెష‌లిస్ట్ డాక్టర్‌ను సంప్ర‌తించిన‌ప్పుడు త‌న‌కు డిజార్డ‌ర్ ఉన్నద‌నే విష‌యం నిర్ధార‌ణ అయ్యింద‌ని చెప్పారు.

మొద‌ట్లో న‌వ్వ‌గానే ఆమెకు శ‌రీరం తేలిక‌గా అయిపోయిన‌ట్లు అనిపించేది. ఆ త‌ర్వాత న‌వ్వితే నిద్ర‌పోవ‌డం మొద‌లైంది. ఇప్పుడు న‌వ్వితే కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డిపోయి నిద్ర‌లోకి జారుకుంటున్న‌ది. ఇంతకుముందే రుగ్మత గురించి తెలుసుకుని ఉంటే ప‌రిస్థితి ఇంత‌దాకా వ‌చ్చేది కాద‌ని, ఈ రుగ్మ‌త బెల్లా డాబా మెట్ల మీంచి పడిపోవడం, డ్రైవింగ్ త‌ప్పిదాల కార‌ణంగా లైసెన్స్ కోల్పోవ‌డం లాంటి ప్ర‌మాదాల‌కు గురైంది.డిజార్డ‌ర్ కార‌ణంగా ప్ర‌మాదాలు..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి

వీవీఐపీల‌కు, మంత్రుల‌కూ దొర‌క‌ని ఆక్సిజ‌న్ బెడ్‌లు

ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా సోకి బీహార్ ప్ర‌భుత్వ‌ చీఫ్ సెక్రెట‌రీ మృతి

క‌రోనా సోకి తీహార్ జైల్లో న‌లుగురు ఖైదీలు మృతి

పీఎం కేర్స్ కొవిడ్ ఆస్ప‌త్రికి 57 మంది స‌భ్యుల‌ నేవీ వైద్య బృందం

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఆంక్ష‌లు పొడిగింపు

తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు

ఆసిఫాబాద్‌లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం

ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

Advertisement
మ‌హిళ‌కు వింత రోగం.. న‌వ్విన ప్ర‌తిసారి నిద్ర‌లోకి..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement