వీవీఐపీలకు, మంత్రులకూ దొరకని ఆక్సిజన్ బెడ్లు..!
Beds shortage in Bengalore: ఆస్ప్రత్రుల్లో రోగులకు సరిపడా ఆక్సిజన్ బెడ్లు లేవు. వీవీఐపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సెలెబ్రిటీలు, హెల్త్‌కేర్ సిబ్బంది కూడా ఆక్సిజన్ బెడ్ల కోసం

బెంగళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగిపోయింది. ఎంతో మందికి ప్రాణావాయువు అవసరమవుతున్నది. కానీ ఆస్ప్రత్రుల్లో రోగులకు సరిపడా ఆక్సిజన్ బెడ్లు లేవు. వీవీఐపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సెలెబ్రిటీలు, హెల్త్‌కేర్ సిబ్బంది కూడా ఆక్సిజన్ బెడ్ల కోసం నానాయాతన పడాల్సి వస్తున్నది. ఇక సామాన్యుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కెర లేదు.
ఆక్సినేటెడ్ బెడ్లతో కూడిన పలు కార్పొరేట్ ఆస్పత్రులు, దాదాపుగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. అన్ని ఆస్పత్రుల ముందు నో బెడ్స్ అవైలెబుల్ అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి, వివిధ మంత్రుల కార్యాలయాలకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదన్న మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్ల కోసం ప్రతిరోజు వీవీఐపీల నుంచి ఫోన్ కాల్స్ వెత్తుతున్నాయి.
ఇటీవల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి కరోనా సోకింది. దాంతో ఆయన మనిపాల్ ఆస్పత్రిలో ఆక్సిజనేటెడ్ బెడ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరికి అపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ దొరకడంతో అందులో అడ్మిట్ అయ్యారు. అదేవిధంగా యెడియూరప్ప క్యాబినెట్‌లోని ఒక మంత్రి బంధవుకు కరోనా సోకడంతో మంత్రి ప్రయత్నించినా బెడ్లు దొరకక ఆక్సిజన్ సిలిండర్ కొని ఇంట్లోనే చికిత్స చేయించారు.
స్పెషలిస్ట్ డాక్టర్లకూ కొరతే..!
కరోనా బారినపడిన ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా బెంగళూరులో ఆక్సిజన్ బెడ్ల కొరతపై సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబసభ్యుల గురించి తెలిపి విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బెంగళూరులో ఆక్సిజన్ బెడ్లకు మాత్రమే కాదు స్పెషలిస్ట్ డాక్టర్లకు కూడా తీవ్ర కొరత ఉన్నదని శాండల్ వుడ్ నటుడు అనిరుధ్ విష్ణువర్ధన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి బీహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మృతి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్‌లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

