Maha Kumbh : ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజూ పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజు కోటీ 65 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా.. ఇవాళ అఖాడాలు అమృత స్నానం ఆచరిస్తున్నారు. దాదాపు 10 వేల ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. స్నాన ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రెండో రోజు ఉదయం 10 గంటల వరకే కోటీ 38 లక్షల మందికిపైగా అమృత స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
మహా కుంభమేళా రెండోరోజూ వైభవంగా సాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జన సంద్రంలా మారిపోయింది. దేశవిదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలిస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు ‘అమృత స్నానం’ చేశారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీశంభు పంచాయతీ అటల్ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి ‘అమృత స్నానం’ ఆచరించారు.
వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్య స్నానాలు చేయాలనే దానిపై మహా కుంభమేళా నిర్వాహకులు ముందుగానే వరుస క్రమంలో ప్రణాళిక సిద్ధం చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు ‘అమృత స్నానం’ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చి పుణ్య స్నానాలు చేశారు.
సాధారణంగా 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత మహా కుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. ‘పుష్య పౌర్ణిమ’ సందర్భంగా సోమవారం ప్రధాన ‘స్నానం’ అంచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత స్నానమని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతో భక్తులు, సాధువులు తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. ‘హర్ హర్ మహదేవ్’, ‘జై శ్రీరామ్’, ‘జైగంగామయ్యా’ అని నినదిస్తూ స్నానాలు చేస్తున్నారు.
కాగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికే కోటి 60 లక్షల మందికిపైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహా కుంభమేళా అధికారులు ప్రకటించారు. అమృత స్నానం చాలా శాంతియుతంగా జరుగుతోందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తమ అధికారులు, జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.
కుంభమేళాకు వస్తున్న భక్తులు, సాధువులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవరూపం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మకర సంక్రాంతి’ శుభసందర్భంగా ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో మొదటి ‘అమృత స్నానం’ చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న భక్తులకు అభినందనలు అని పోస్ట్ చేశారు. తొలిరోజు కోటీ 75 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ సీఎం తెలిపారు.
#MahaKumbhMela2025 | Prayagraj: More than 1.38 crore devotees have taken a holy dip till 10 am today.
Source: Information Department, Government of Uttar Pradesh pic.twitter.com/s8p68lTL4d
— ANI (@ANI) January 14, 2025
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే