శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 19:28:16

తమిళనాడు సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌

తమిళనాడు సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.  తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను మూసివేయాలని తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు కోర్టు అనుమతించింది.  ఆన్‌లైన్‌ లిక్కర్‌ అమ్మకాలకు కూడా మే 17 వరకు మాత్రమే పర్మిషన్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం షాపుల  వద్ద భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దంటూ ఆదేశించింది. 


logo