కరోనా మరణాలను దాస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం!
మధ్యప్రదేశ్| కరోనా మృతుల లెక్కను మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాస్తున్నది. రాష్ట్రంలో ఉన్న స్మశానవాటికలకు ప్రతిరోజు వరదలా మృతదేహాలు వస్తున్నాయి.

న్యూఢిల్లీ: కరోనా మృతుల లెక్కను మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాస్తున్నది. రాష్ట్రంలో ఉన్న స్మశానవాటికలకు ప్రతిరోజు వరదలా మృతదేహాలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వ లెక్కల్లో మాత్రం మృతుల సంఖ్యను స్వల్పంగా చూపిస్తున్నది. రాష్ట్రంలో నిన్న ముగ్గురు మాత్రమే మరణించారని వెల్లడించింది. అయితే ఒక్క భోపాల్‌లోనే 94 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. మృతదేహాలను దహణం చేయడానికి మూడు నాలుగు గంటలకుపైగా వేచి ఉండాల్సి వస్తుంది. కొందరికైతే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి స్థలం కూడా దొరకడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం రోజువారీ కరోనా మృతులను ఒకట్ల సంఖ్యలోనే చూపిస్తుండటం విశేషం.
కరోనా మరణాలను ఏఒక్కరూ ఆపలేరు
కాగా, మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర మంత్రి పటేల్‌ను మీడియా ప్రశ్నించగా.. కరోనా వల్ల మరణాలను ఏ ఒక్కరూ ఆపలేరు. మనుషులు వృద్ధులైన తర్వాత చనిపోవాల్సిందే కదా అని సమాధానం ఇచ్చారు. ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారని మీరంటున్నారు. ప్రజలు వృద్ధులవుతున్నారు. దీంతో వారు మరణించక తప్పదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 12,727 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,704కు చేరింది. ఇందులో 4713 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్థిక కష్టాలు.. అటుపై కరోనా పాజిటివ్.. కూలీ బలవన్మరణం
అరెస్ట్ భయంతో బాత్రూమ్ కిటికీలోంచి దూకిన క్రిమినల్..
తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు
వికాశ్ దూబే ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు క్లీన్ చిట్
ఇన్జెన్యువిటీ ప్రయోగంలో ఇండియన్
కరోనాకు ట్యాబ్లెట్!
ప్రాణం కంటే డబ్బే ఎక్కువనా?
‘అన్నపూర్ణ’ను అధిరోహించిన తొలి భారతీయురాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

