వికాశ్ దూబే ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు క్లీన్ చిట్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆరోపణలు వచ్చాయి. దానిపై సుప్రీం కోర్టు వేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ తన నివేదికలో ఆ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేనట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో వికాశ్ దూబేతో పాటు మరో అయిదుగురు అనుచరుల్ని పోలీసులు హతమార్చారు. యూపీలో గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వికాశ్ గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులు హతమార్చింది. ఆ తర్వాత పరారీ అయిన వికాశ్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు.
ఉజ్జయిని నుంచి యూపీకి తీసుకువస్తున్న సమయంలో పోలీసులు వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో ఉన్న వికాశ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పోలీసులు వికాశ్‌ను కాల్చి చంపారు. వికాశ్ కాల్చివేత పట్ల మీడియాతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్ అంశంలో పోలీసులకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, కానీ ఆ కాల్పులకు మద్దతుగా బోలెడు సమాచారం ఉన్నట్లు కమిటీ పేర్కొన్నది. వికాశ్ ఎన్‌కౌంటర్‌ను తప్పుపడుతూ ఎవరూ ఆధారాలు సమర్పించలేదని జస్టిస్ చౌహాన్ తన నివేదికలో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

