పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిన నిరుపేద విద్యార్థిని నిఖితకు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె చదువును కొనసాగించేందుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి...
– నిఖిత ఎంబీబీఎస్ చదువుకు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి రూ.50 వేల సాయం
బీబీనగర్, అక్టోబర్ 23 : ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిన నిరుపేద విద్యార్థిని నిఖితకు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె చదువును కొనసాగించేందుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన సోము మాధవి జంగయ్య దంపతుల కుమార్తె సోము నిఖిత పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్మీడియట్లో 1,000 మార్కులకు 989 మార్కులు సాధించింది. నీట్లో మంచి ర్యాంకు సాధించి పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని నిఖిత చదువుకున్న 10వ తరగతి పాఠశాల కరస్పాండెంట్ ఈసారపు అచ్చయ్య గౌడ్ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి రూ.50 వేల సాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదన్నదే తమ అభిమతమని, నిఖిత వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్, పింగల్ అన్న సేవాదళ్ అధ్యక్షుడు ఎండీ మోయిన్, ఎలుగుల నరేందర్, కాసుల అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

