Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 23న ఆయన 47వ పుట్టినరోజు జరుపుకుంటుండటంతో గురువారం రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రభాస్ నివాసం వద్ద అభిమానుల సందడి ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు జపాన్‌లోనూ డార్లింగ్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 23న ఆయన 47వ పుట్టినరోజు జరుపుకుంటుండటంతో గురువారం రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రభాస్ నివాసం వద్ద అభిమానుల సందడి ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు జపాన్‌లోనూ డార్లింగ్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా జపాన్ అభిమానులు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు జపాన్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు అక్కడ లభించిన ఆదరణతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది.
గతంలో ప్రభాస్ జపాన్ పర్యటనకి వెళ్లడంతో అక్కడి అభిమానుల్లో ఆయనపై అభిమానం మరింత బలపడింది. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జపాన్‌కు చెందిన అభిమానులు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. నలుపు, బంగారు రంగుల దుస్తులు ధరించి, కేకులు, బెలూన్లు, ప్రభాస్ సినిమాల పోస్టర్లతో వేదికను అలంకరించారు. ‘హ్యాపీ బర్త్‌డే ప్రభాస్-సాన్’ అంటూ జపనీస్ భాషలో పాటలు పాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు, కొందరు అభిమానులు తెలుగులోనూ ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆయన జపాన్‌కు రావడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆయన కొత్త సినిమాలు విడుదలైనప్పుడు భారత్‌కు వచ్చి థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నట్లు ఆ వీడియోలో తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన అభిమానులు, భారీ కటౌట్లు, జెండాలతో సందడి చేశారు. ప్రభాస్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మరోవైపు భీమవరం సహా పలు ప్రాంతాల్లోనూ అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజును ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ పరిసరాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ గారు 🎂🎉✨✨✨
プラバースさんお誕生日おめでとうございます🥳
昨年は念願の来日、本当に感動しました!またいつでも日本へお越しください💕
新作が公開されたらインドへ観に行きたいです☺️✨
#Prabhas
#HappyBirthdayPRABHAS
#JapanLovesPrabhas https://t.co/c2rOb8dvVu— ノリ🐘నొరి🪓🦖 (@baahunoli) October 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

