Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
Actor Naslen | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'సీన్'. కరుప్పు, విశ్వానాథన్ ఆండ్ సన్స్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్న సూర్య ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
Actor Naslen | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సీన్’. కరుప్పు, విశ్వానాథన్ ఆండ్ సన్స్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్న సూర్య ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో మలయాళ టాలెంటెడ్ నటుడు నస్లేన్ తమిళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా అడుగుపెడుతున్నారు. ఇక బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో నస్లేన్ ‘ఈశ్వరన్’ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో సూర్య ఒక శక్తివంతమైన పోలీస్ అధికారిగా డి.ఎస్.పి. ఇన్బరాజ్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. సూర్య సరసన నజ్రియా ఫహాద్ నటిస్తుండగా, మలయాళ సంగీత సంచలనం సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. సూర్య, జ్యోతికల నూతన ప్రొడక్షన్ హౌస్ ‘జగరం స్టూడియోస్’ మరియు ‘2D ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న థియేటర్లలో అట్టహాసంగా విడుదల చేయనున్నారు. నస్లేన్ విలన్ ఎంట్రీ, సూర్య పోలీస్ గెటప్ కలిసి ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

