Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Shamonda Virus: షామోండా వైరస్‌కు ఎక్కువగా పశువులకు సోకుతుంది. కానీ ఆ వైరస్ వల్ల ఫ్రాన్స్‌లో ఓ మనిషి చనిపోయాడు. గొర్రెలు, మేకలు, గుర్రాల్లో ఎక్కువగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. యురోప్లో ప్రస్తుతం ఈ వైరస్ కలవరం రేపుతున్నది.
పారిస్: షామోండా వైరస్(Shamonda Virus) మనిషికి సోకి ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. సాధారణంగా పశువులకు ఈ వైరస్ సోకుతుంది. కానీ యూరోప్‌లో ఓ వ్యక్తికి ఆ వైరస్ సోకడం కలకలం రేపుతోంది. నైజీరియాలో తొలిసారి కనిపించిన ఆ వైరస్ కొన్ని దశాబ్ధాల తర్వాత యూరోప్‌లో ప్రత్యక్షమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ షామోండా వైరస్ అంటే ఏమిటి. కీటకాలు, పురుగులు కుడితే షామోండా వైరస్ సోకుతుంది. ప్రధానంగా పశువులకు ఆ వ్యాధి వ్యాపిస్తుంది. గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె జాతికి చెందిన అల్పకా జంతువుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. ష్కామల్లెన్బర్గ్ వైరస్‌గా దీన్ని గుర్తిస్తారు. అయితే పశువుల్లోని పునరుత్పత్తి వ్యవస్థపై ఈ వైరస్ దాడి చేస్తుంది. దీంతో ఆయా జంతువులకు సమస్యలు వస్తుంటాయి.
1965లో తొలిసారి నైజీరియాలోని పశువుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ వైరస్ కనిపించింది. జూలైలో తాజాగా యూరోప్‌లో దీన్ని గుర్తించారు. అక్టోబర్ 20 నాటికి కేసులను రిజిస్టర్ చేశారు. డజన్ల సంఖ్య దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఐర్లాండ్‌లోని క్యాటిల్ బ్రీడర్ల వద్ద వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. స్ప్రింగ్ సీజన్ నుంచి వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు ఫ్రాన్స్ పేర్కొన్నది.
పశువుల్లో షమోండా లక్షణాలు చాలా ఉన్నాయి. జంతువులకు జ్వరం వస్తుంది, విరేచనాలు అవుతాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. అబార్షన్ లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నది. పశువుల గర్భం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్ని గుర్రాల్లో ఈ వైరస్ వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. షమోండా వేరియంట్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.
షమోండా వైరస్ వల్ల మనుషుల్లోనూ తీవ్ర సమస్యలు ఉంటాయి. లియాన్ నగర ఆస్పత్రిలో తొలిసారి ఓ పేషెంట్‌ను అధ్యయనం చేశారు. అతడిలో ఇమ్యూన్ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఐసోలేటెడ్ కేసు అని, ఈ వైరస్ మనుషుల్లో వ్యాప్తి అవడం అరుదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఓ కీటకం కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ జరిగి ఉంటుందని ఫ్రెంచ్ అధికారులు భావిస్తున్నారు. తొలుత పశువుల్లో వైరస్ వ్యాప్తి అయినట్లు గుర్తించారు. పేషెంట్ బ్రెయిన్లో ఉన్న సమస్యలు.. షామోండా వైరస్ లక్షణాలు పోలి ఉన్నట్లు తేల్చారు. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ప్రకారం షామోండా వైరస్ వ్యాధి కాదు అని తెలుస్తోంది. జంతు ఆరోగ్య చట్టాల్లోనూ ఈ వైరస్ గురించి లిస్టింగ్ లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

