Flight crash : అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 53 మంది బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనడియన్ (Canadian) ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ ఒక్క కెనడియన్ భారత సంతతికి చెందిన మహిళా డెంటిస్ట్ (Dentist) నీరాలి పటేల్ (Nirali Patel) గా గుర్తించారు.
నీరాలి పటేల్ కెనడా రాజధాని టొరంటోలోని ఎటోబికోక్‌లో భర్త, ఏడాది పాపతో కలిసి ఉంటోంది. ఒంటారియోలోని మిస్సిసౌగాలో దంత వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల నాలుగు రోజుల ట్రిప్ కోసం భారత్‌కు వచ్చింది. ట్రిప్ ముగించుకుని కెనడాకు వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించింది.
నీరాలి 2016లో భారత్‌లోనే డెంటిస్ట్ కోర్సు పూర్తి చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. డెంటిస్ట్ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆమె 2019లో ఒంటారియోలో డెంటిస్ట్‌గా లైసెన్స్ తీసుకుని ఓ క్లినిక్‌లో వైద్యురాలిగా పనిచేస్తోంది. భారత్ టూర్‌కు వచ్చి తిరిగి వెళ్తూ ప్రాణాలు కోల్పోయింది.