PM Modi : అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) కారణంగా గాయపడి ఆస్పత్రిపాలైన వారిని, విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక వ్యక్తి రమేశ్ బిశ్వాస్ కుమార్ (Ramesh Biswas Kumar) ను ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Narendra Modi) శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఉదయం అహ్మదాబాద్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
విమానం గురువారం మధ్యాహ్నం బీజే మెడికల్‌కు చెందిన యూజీ మెస్ బిల్డింగ్పైపడి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందికిగాను 241 మంది మరణించారు. రమేశ్ బిశ్వాస్ అనే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతనిప్పుడు అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా ప్రమాద సమయంలో విమానం ఢీకొట్టిన బిల్డింగులో ఉన్న పలువురు కూడా మరణించారు.
మరికొంత మంది గాయపడ్డారు. వాళ్లు కూడా అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ వారిని పరామర్శించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు, బాధితుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యావత్ భారత దేశం బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు.