Upadi Hami | రాయపోల్, ఫిబ్రవరి 11 : ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని సిద్ధిపేట జిల్లా అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ 4వ విడత ప్రత్యేక సమావేశం మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలో 230 పనులు చేపట్టగా.. అందులో మూడు కోట్ల 95 వేల రూపాయలు చెల్లించారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలను ప్రజాదర్బార్‌లో గ్రామపంచాయతీ వారిగా వివరాలను వెల్లడించారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వివరాలు అందుబాటులో ఉంచడంలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కొన్ని గ్రామాల్లో ఎంబీ రికార్డు లేకుండానే బిల్లులు చెల్లించారని.. పనులు చేయకుండా చేసినట్లు రికార్డులో కూలీల పేర్లు నమోదు చేశారని సామాజిక తనిఖీలో వెలుగులోకి వచ్చాయి.
ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల..
గ్రామాల్లో జాబ్ కార్డులు అప్డేట్ లేకపోవడంతోపాటు రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం పట్ల సిద్ధిపేట జిల్లా అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించి పనులు మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో ఉపాధి సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్ మండిపడ్డారు. అన్ని గ్రామాల్లో ఉపాధి రికార్డులు సరిగా లేకపోవడం సామాజిక తనిఖీ బృందం బయట పెట్టింది.
అనంతరం అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి కూలీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదన్నారు. రికార్డులు, జాబ్ కార్డు ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీష్, అంబుజుమాడ్ ఖాజా అరీఫ్ అల్లి, క్యూ సి ఓ సంతోష్ రెడ్డి, విజిలెన్స్ మేనేజర్ గణేష్, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ అంజా గౌడ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ అశోక్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ రామ్ కుమార్, ఏపీఓ జనార్దన్, ఎంపీఓ శివకుమార్, సర్పంచులు రేకుల నరసింహారెడ్డి, పర్వేజ్ అహ్మద్, మాసంపల్లి రాజు, సోమని నిర్మాల, ఉశిగారి స్వామి, చిందం శశికాంత్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల