టేకులపల్లి, ఫిబ్రవరి 10 : టేకులపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని బద్దుతండ ఏకలవ్య ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ స్కూల్ లో దరఖాస్తు చేయదలిచిన షెడ్యూల్ తెగల (ఎస్టీ) వర్గానికి చెంది.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని ఆయన కోరారు.
ఏకలవ్య స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ నెల 31 మార్చి నుంచి 2013, 31 మార్చి 2019 మధ్య జన్మించిన వారై ఉండాలని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దివ్యాంగులైన పిల్లలకు రెండు సంవత్సరాల వయో సడలింపు ఉంటుందని ఆయన చెప్పారు. అలాంటివారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షకు మించకూడదని పేర్కొన్నారు.
దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీలోపు సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. 6వ తరగతిలో మొత్తం సీట్లు 60 ఉంటాయని, వీటిలో 30 బాలురు, 30 బాలికలకు కేటాయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.