security breach | లోక్‌సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలర్ స్మోక్ వదలడం తీవ్ర కలకలం రేపింది. పార్లమెంట్ భవనంపై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో.. తాజా ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా పరిణాలమాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మరికాసేపట్లో అఖిలపక్ష నేతలతో స్పీకర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ భవనంలో దాడి ఘటనపై చర్చించనున్నారు. భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్షించనున్నారు. మరోవైపు ఘటన నేపథ్యంలో లోక్‌సభలో విజిటర్స్ పాసులపై స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విజిటర్స్ పాస్‌లపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు భద్రతా వైఫల్యం ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ.. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్‌తో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. మరో ఆగంతకుడిని మైసూర్‌కు చెందిన మనోరంజన్ డీగా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు.
Also Read..
Parliament Security Breach | బీజేపీ ఎంపీ విజిటర్ పాస్‌తోనే సభ లోపలికి.. అసలేం జరిగింది ?
Loksabha | బీజేపీ ఎంపీ విజిటర్ పాస్‌తో.. లోక్‌సభలో చొరబడ్డ ఆగంతకులు
Security Breach in Lok Sabha | ఆగంతకులు ఎలా రెచ్చిపోయారంటే..!