Loksabha | బీజేపీ ఎంపీ విజిటర్ పాస్‌తో.. లోక్‌సభలో చొరబడ్డ ఆగంతకులు
Loksabha | లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి హల్చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే పట్టుబడ్డ ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ.. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్‌తో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు.
Loksabha | న్యూఢిల్లీ : లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి హల్చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడ్డ ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ.. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్‌తో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. మరో ఆగంతకుడిని మైసూర్‌కు చెందిన మనోరంజన్ డీగా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. ఆగంతకుల్లో ఒకరు తమ బూట్లలో దాచుకున్న ఎల్లో కలర్ గ్యాస్‌ను సభలో వదిలారు. దీంతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇక పార్లమెంట్ బయట కూడా మరో ఇద్దరు వ్యక్తులు హంగామా సృష్టించారు. టియర్ గ్యాస్‌ను వదిలారు. మహిళతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభలో విజిటర్స్ పాసులపై స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విజిటర్స్ పాస్‌లపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

