Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) రాజస్థాన్లోని కోటా (Rajasthans Kota)లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
#WATCH | “People are taking active participation in this festival of democracy. Every voter should exercise his right to vote to express her/her views,” says Lok Sabha Speaker Om Birla in Kota, Rajasthan. pic.twitter.com/wP9GDaxgJi
— ANI (@ANI) November 25, 2023
రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. కరన్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనార్ (Gurmeet Singh Koonar) మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. 199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు.
కాగా, 59 మంది సిట్టింగ్లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆప్, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్ నుంచి పోటీ ఎదురవుతున్నది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Rajasthan Elections | ఉదయం 11:30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
Rajasthan Elections | రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Ileana DCruz | నేను సింగిల్ పేరెంట్ కాదు.. తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా