Ileana DCruz | నేను సింగిల్ పేరెంట్ కాదు.. తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా
Ileana DCruz | ప్రముఖ నటి ఇలియానా (Ileana DCruz) ఇటీవలే తల్లైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన లైఫ్ పార్ట్నర్ (partner) ఎవరో అభిమానులకు పరిచయం చేసేసింది.
Ileana DCruz | ప్రముఖ నటి ఇలియానా (Ileana DCruz) ఇటీవలే తల్లైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Pheonix Dolan) అని పేరు పెట్టి అభిమానులకు పరిచయం చేసింది. అయితే బాబు తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. తాజాగా ఆ సస్పెన్స్‌కు ఈ గోవా బ్యూటీ తెరదించింది. తన లైఫ్ పార్ట్నర్ (partner) ఎవరో ఎట్టకేలకు అభిమానులకు పరిచయం చేసేసింది.
ఇటీవలే ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘మీరు మీ బిడ్డను ఒంటరిగా ఎలా పెంచుతున్నారు..?’ అంటూ ప్రశ్నించారు. దీనికి నటి స్పందిస్తూ.. ‘నేను సింగిల్ పేరెంట్ కాదు’ (not a single parent) అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన పార్ట్నర్ ఫొటోను షేర్ చేసింది. గతంలో ఇలియానా ‘డేట్ నైట్’ అంటూ లవ్ సింబల్‌ను జత చేసి ఓ వ్యక్తితో ఉన్న ఫొటోను ఇన్స్టావేదికగా షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే తన పార్ట్నర్ అని తాజాగా స్పష్టతనిచ్చింది. దీంతో ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరన్న ప్రశ్నకు.. సమాధానం దొరికినట్లైంది.
ఇలియానా తాను ప్రెగ్నెంట్ అంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా పంచుకుంది. అయితే, తన పార్ట్నర్ ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. తాను కష్టంలో ఉన్న సమయంలో అతడు తోడుగా నిలిచాడని సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది. అయితే, బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. మిచల్ డోలన్ (Michael Dolan) అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా తన పార్ట్నర్ ఫొటో షేర్ చేసిందే తప్ప.. పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ.. 2018లో వచ్చిన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చివరిసారిగా తెలుగుతెరపై కనిపింది. ఇక బాలీవుడ్లో2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్‌బుల్‌లో కనిపించింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆశ్వాదిస్తోంది.
Also Read..
Mansoor Ali Khan | మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష రియాక్షన్ ఇదీ
Amitabh Bachchan | తన జుహూ బంగ్లాను కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అమితాబ్
Sabarimala Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న 70 వేల మంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

