Amitabh Bachchan | తన జుహూ బంగ్లాను కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అమితాబ్
Amitabh Bachchan | బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన కుమార్తె శ్వేతా నంద (Shweta Nanda)కు కోట్లు విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Amitabh Bachchan | బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన కుమార్తె శ్వేతా నంద (Shweta Nanda)కు కోట్లు విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న తమ విలాసవంతమైన బంగ్లా (Juhu bungalow) ‘ప్రతీక్ష’ ( Prateeksha)ను శ్వేతకు బహుమతిగా ఇచ్చినట్లు బాలీవుడ్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఆ బంగ్లా విలువ రూ.50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కుమార్తె శ్వేత పేరిట ఇంటిని రిజిస్టర్ చేయించినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. నవంబర్ 8న ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.
ఈ బంగ్లా విఠల్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉంటుంది. ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్‌లో విస్తరించి ఉంది. వీటి మొత్తం విలువ సుమారు రూ.50.63 కోట్లని అంచనా. అమితాబ్ తన కెరీర్ ప్రారంభంలో తల్లిదండ్రులతో కలిసి ఈ బంగ్లాలోనే చాలా సంవత్సరాలు నివసించారు. ఆ తర్వాత వేరే బంగ్లాలోకి మారిపోయారు. కాగా, అమితాబ్‌కు జుహూలో జల్సా (Jalsa), జనక్ అనే రెండు బంగ్లాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బిగ్‌బీ కుటుంబం జల్సాలో నివసిస్తోంది.
Also Read..
Minister KTR | మార్పు అంటే.. 3 గంటల కరెంటా?.. ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
Prayagraj | టికెట్ విషయంలో గొడవ.. బస్సు కండక్టర్‌పై కత్తితో దాడిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

