Mansoor Ali Khan | మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష రియాక్షన్ ఇదీ
Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై ఇటీవలే అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) ఎట్టకేలకు శుక్రవారం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష పరోక్షంగా స్పందించింది.
Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై ఇటీవలే అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) ఎట్టకేలకు శుక్రవారం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. తాను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. అయితే, మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘సమాజంలో మనుషులు తప్పు చేస్తుంటారు. అలాంటప్పుడు వారిని క్షమించడమే గొప్ప విషయం’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్టైంది. ప్రస్తుతం త్రిష ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. గతంలో ఎన్నో రేప్ సీన్లలో నటించానని తెలిపాడు. అయితే, లియో చిత్రంలో త్రిషతో అలాంటి సీన్ లేకపోవడం బాధకలిగించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటుడి వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లియో దర్శకుడు లోకేశ్ కనగరాజు సహా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితర నటులు మన్సూర్‌పై మండిపడ్డారు. త్రిష సైతం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. నటుడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కేసు కూడా నమోదు చేశారు. నడిగర్ సంఘం (Nadigar Sangam) సైతం ఆయనపై చర్యలు చేపట్టింది. ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. అయినా కూడా తాను త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మన్సూర్. అయితే, పరిస్థితి తీవ్రత మేరకు ఎట్టకేలకు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
Also Read..
Mansoor Ali Khan | ఎట్టకేలకు త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీ ఖాన్
Amitabh Bachchan | తన జుహూ బంగ్లాను కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అమితాబ్
Janhvi Kapoor | చెల్లెలు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన జాన్వీకపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

