Wine Shops | డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట దాకా మద్యం అమ్మకాలు.. ఉత్తర్వులు జారీ
Wine Shops | రాష్ట్ర ఖజానాను నింపుకొనేందుకు ఎన్నో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నది. ఈ నెలాఖరున ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే.
Wine Shops | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఖజానాను నింపుకొనేందుకు ఎన్నో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నది. ఈ నెలాఖరున ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా విందులు, వినోదాలలో మద్యం ఏరులై పారుతుంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా ‘క్యాష్’ చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం అమ్ముకోవడానికి, విచ్చలవిడిగా మందు తాగడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. ఈ మేరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. డిసెంబరు 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి, టూరిజం ప్రాంతాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం సేవించడానికి అనుమతి ఇచ్చారు. ఇక ఏ4 షాపులు (మద్యం షాపులకు) రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేరొన్నారు.
27 నుంచి 31 వరకూ ప్రత్యేక తనిఖీలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27cనుంచి 29 వరకు ఎన్డీపీఎల్, ఎన్‌డీపీఎస్‌లపై దాడులు జరుగుతాయని.. 30, 31న ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, గంజాయి, డ్రగ్స్‌పై దాడడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐడీ లికర్ (నాటుసారా లికర్) దాడులు నిర్విహిస్తారని తెలిపారు. డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రత్యేక ఈవెంట్లు, వాహన తనిఖీలు, రూట్ వాచ్ చేపట్టి నాన్‌డ్యూటీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ఉన్న 20 చెక్ పోస్టుల్లోను, రైళ్లు, వాహనాల్లోనూ అక్రమంగా తరలించే మద్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

