Parliament Monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో (Lok Sabha) విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్‌లో సర్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ వెలుపల విపక్ష కూటమి ఎంపీల ధర్నా
మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ధర్నా చేపట్టారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
VIDEO | Monsoon Session: INDIA bloc protests over SIR exercise in Bihar at Parliament premises.#Bihar #SIR pic.twitter.com/pCG4On6SxF
— Press Trust of India (@PTI_News) July 28, 2025
Also Read..
Parliament Session | సిందూర్‌పై చర్చ.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్