Kiren Rijiju | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్‌సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చ ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఆసక్తికర పోస్టు పెట్టారు. పాకిస్థాన్‌ను రావణుడితో పోల్చారు.
రావణుడు లక్ష్మణ రేఖను దాటడం వల్ల లంక అగ్నికి ఆహుతైందన్నారు. అదేవిధంగా భారత్ గీసిన గీత (సరిహద్దు)ను దాటినప్పుడు పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలు కాలిపోయాయని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్లై ఈరోజు చర్చ ప్రారంభం కానుంది.. రావణుడు లక్ష్మణ రేఖను దాటినప్పుడు లంక కాలిపోయింది. పాకిస్థాన్.. భారతదేశం గీసిన గీతను దాటినప్పుడు ఉగ్రవాద శిబిరాలు అగ్నికి ఆహుతయ్యాయి..!’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Discussion on #OperationSindoor to begin today…
When Ravan crossed the Laxman Rekha, Lanka burned. When Pakistan crossed the red lines drawn by India, terrorist camps faced the fire!
जब रावण ने लक्ष्मण रेखा पार की, तो लंका जल गई। जब पाकिस्तान ने भारत द्वारा खींची गई लाल रेखा… pic.twitter.com/GHh6MtkzsL— Kiren Rijiju (@KirenRijiju) July 28, 2025
వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలపై మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. సుదీర్ఘ చర్చ అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు.
Also Read..
Parliament Session | సిందూర్‌పై చర్చ.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్
Suicide | అత్తింటి వారి వేధింపులు.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య