Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి.
Winter session of Parliament | Lok Sabha proceedings adjourned till noon
— ANI (@ANI) December 10, 2024
మరోవైపు సమావేశాల ప్రాంభానికి ముందు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
Winter session of Parliament | Rajya Sabha proceedings adjourned till noon
— ANI (@ANI) December 10, 2024
New Delhi: Congress’s meeting of Lok Sabha MPs in the Main Committee Room of Parliament Annexe ends.
The meeting was chaired by Leader of Opposition Rahul Gandhi.
(Image Source: AICC) pic.twitter.com/GPWZRJdALS
— ANI (@ANI) December 10, 2024
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?
తమ పట్ల వివక్షా వైఖరిని ప్రదర్శిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తీర్మానంపై 50 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసినట్టు ఆ వర్గాలు సోమవారం తెలిపాయి. రాజ్యసభ నుంచి తాము తరచు వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్ఖర్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చైర్మన్ తగినంత సమయాన్ని కేటాయించడం లేదని వారు భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
Also Read..
Jamili Elections | ఈ సమావేశాల్లోనే జమిలి.. బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
Air Pollution | ఢిల్లీలో మళ్లీ అధ్వాన స్థితికి చేరిన గాలి నాణ్యత.. 224గా ఏక్యూఐ లెవల్స్
KTR | రాహుల్జీ మీరు చేసింది సరైనదైతే.. మిమ్మల్ని అనుసరించిన మాకెందుకు అనుమతి లేదు..? : కేటీఆర్