Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) మళ్లీ సాధారణ స్థితికి చేరింది. గత వారం కాస్త మెరుగుపడిన వాయు నాణ్యత.. ఈ వారం అధ్వాన స్థితికి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా (Central Pollution Control Board) ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 224గా నమోదైంది.
ఐటీవో ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 254గా, అలీపూర్‌లో 214గా, ఛాందినీ చౌక్ వద్ద 216, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 203గా గాలి నాణ్యత నమోదైంది. కొన్ని ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో మోడరేట్ కేటగిరీలో గాలి నాణ్యత సూచీ నమోదైంది. డీటీయూలో 169, లోధి రోడ్డులో 123, నజఫ్‌గర్‌లో 142గా ఏక్యూఐ ఉంది. ఇక నిన్న ఢిల్లీలో గాలి నాణ్యత 231గా నమోదైన విషయం తెలిసిందే. గత వారం ఏక్యూఐ లెవల్స్ 200 లోపే నమోదయ్యాయి.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
KTR | రాహుల్జీ మీరు చేసింది సరైనదైతే.. మిమ్మల్ని అనుసరించిన మాకెందుకు అనుమతి లేదు..? : కేటీఆర్
Winter Virus | వింటర్ వైరస్‌లకు వెరవొద్దు.. సీజనల్ వ్యాధుల్ని తప్పించుకుందాం ఇలా..
KTR | చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో.. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటే: కేటీఆర్