KTR | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదానీ వ్యతిరేక నిరసనల్లో కాంగ్రెస్ ద్వంద్వవైఖరి పాటిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఒకలా, తెలంగాణ అసెంబ్లీలో మరోలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘రాహుల్ జీ ఇది ఎలాంటి వంచన..? పార్లమెంట్లో అదానీ – మోదీ (Adani-Modi) ఫొటో ఉన్న టీషర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ – రేవంత్ (Adani-Revanth) వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు..? దీనికి సమాధానం చెప్పండి’ అంటూ కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు రాహుల్.. మోదీ – అదానీ చిత్రాలతో ఉన్న టీషర్ట్లను ధరించిన ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Dear @RahulGandhi Ji,
What kind of hypocrisy is this?
If it is right for you to wear a T-shirt with Adani-Modi pic in parliament,
Why are we not allowed to follow in your footsteps and expose Adani-Revanth affair in Telangana assembly ?
Please do tell… pic.twitter.com/4ZK4DrCaDV
— KTR (@KTRBRS) December 10, 2024
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. అదానీ-రేవంత్ మధ్య చీకటి బంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ ఫొటోలు ముద్రించిన టీ-షర్టులను ధరించగా, లోపలికి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమకు నిరసన తెలిపే హక్కు లేదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
Also Read..
KTR | చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో.. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటే: కేటీఆర్
KTR | నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్