Abhishek Sharma : మూడో టీ 20 వరల్డ్‌కప్ వేటలో భారత జట్టు కీలక మ్యాచ్‌ల ఆడనుంది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్ 8లోనూ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది. అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్ సేన ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రికార్డులు 5-2తో భారత్‌కే అనుకూలంగా ఉన్నా.. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఉప్పెనలా విరుచుకుపడి భారీ స్కోర్లకు పునాది వేసే ఈ చిచ్చరపిడుగు టచ్‌లోకి రావాలని కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కోరుకుంటున్నారు. మెగా టోర్నీలో వరుస డకౌట్లపై అభిషేక్ సైతం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తొలి ప్రపంచకప్ ఆడుతున్న అభిషేక్ అనూహ్యంగా విఫలమవుతున్నాడు. నంబర్ 1 బ్యాటర్‌గా బౌలర్లను వణికిస్తాడనుకుంటే.. తొలి ఓవర్లోనే వికెట్ ఇచ్చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. లీగ్ దశలో మూడు డకౌట్లతో నిరాశపరిచిన అభిషేక్‌ను తప్పించి.. సంజూ శాంసన్‌ను ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ డకౌట్లతో తనపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో అతడు తన గేమ్ ప్లాన్ గురించి చెప్పాడు. నేను ఇంతే. నా ఆట ఇంతే అని అన్నాడు.
Indian skipper Suryakumar Yadav feels now is the time to return the favour to Abhishek Sharma during his lean patch with the bat 🙌#SuryakumarYadav #AbhishekSharma #IndianCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/2Q2juBtQoO
— InsideSport (@InsideSportIND) February 21, 2026
‘నా బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. రెండేళ్ల క్రితమే నేను ఒత్తిడికి లోనవ్వడం మానేశాను. ఒత్తిడిని నేను ఆస్వాదిస్తాను. బ్యాటర్‌గా ఎత్తుపల్లాలు ఎదురవ్వడం సహజం. కొన్ని మ్యాచుల్లో స్కోర్ చేస్తాం.. కొన్నిసార్లు విఫలమవుతాం. కానీ, వ్యక్తిగతంగా మెరుగ్గా ఆడాలనేది నేను నిర్ణయించుకోవాలి. దూకుడుగా ఆడడం కొన్నిసార్లు ఫలితాన్నివ్వదు. అలాఅనీ నా ఆటను మార్చుకోను. ఎందుకంటే మైదానంలో బాగా ఆడడం అనేది నా చేతుల్లోనే ఉందని నమ్ముతాను. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం.. ఏదైనా నా చేతుల్లోనే ఉంటుంది’ అని అభిషేక్ విమర్శలకు ఘాటుగా బదులిచ్చాడు.
“I won’t ever change my process and mindset.” 📈#AbhishekSharma ‘BELIEVES’ in himself as India march into the Super 8 vs #SouthAfrica. 💪
Predict his score against South Africa in the comments.🧐
ICC Men’s #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/kgNbhfsWC1
— Star Sports (@StarSportsIndia) February 21, 2026
నిరుడు ఆసియాకప్‌లో చితక్కొట్టుడుతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికైన అభిషేక్ ప్రపంచకప్‌లో మాత్రం ఉసూరుమనిపిస్తున్నాడు. లీగ్ దశలో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై అతడు సున్నాకే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ మెరుపులతో శుభారంభమివ్వడంతో టీమిండియా బతికిపోయింది. కానీ, సూపర్ 8లో బిగ్ హిట్టర్ అభిషేక్ బ్యాట్ ఝులిపించాలని మేనేమెంట్, అభిమానులు ఆశిస్తున్నారు.
అందుకే.. వరుసగా విఫలమైనా అతడికి అండగా నిలుస్తున్నారు కోచ్ మోర్నీ మోర్కెల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సన్నద్ధత గురించి సారథి సూర్య మాట్లాడుతూ.. ‘అభిషేక్ ఆట కంటే.. అతడి గురించి ఆందోళనచెందే వారి గురించి మేము ఎక్కువగా ఆందోళన చెందుతున్నాం. క్రికెట్ అనేది సమిష్టి ఆట. రెండేళ్లుగా అతడు జట్టుకు ఎంతో చేశాడు. ఇప్పుడు మేము అతడికి అండగా నిలవాల్సిన సమయమిది’ అని అన్నాడు.