గద్వాల అర్బన్ : జిల్లాలోని విద్యుత్ శాఖలో విధులు నిర్వహించే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉతర్వులు జారీ చేశారు.జిల్లాలోని అలంపూర్ పరిధిలోని వడ్డేపల్లి, శాంతినగర్ ఏఈ సుబ్బ రాయుడు, ధరూర్ మండలం పరిధిలోని అల్వల్పాడు సబ్ స్టేషన్లో లైన్ మెన్‌గా విధులునిర్వహిస్తున్న షేక్షావలి ఈ ఇద్దరు విద్యుత్ వినియోగదారులతో ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేసిన్నట్లు అరోపణలు ఉన్నాయి.
అందులో ముఖ్యంగా వినియోగదారులు ఈ ఇద్దరి అధికారు మీద విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు…ఏఈ సుబ్బరాయుడు, లైన్మెన్షేక్షావలిలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించగా ఫోన్‌పే ద్వారా లంచాలు వసూలు చేసిన్నట్లు గుర్తించారు. లంచాలు వసూలు చేస్తున్న ఈ ఇద్దరి అధికారులపై సస్పెండ్ చేస్తు ఉతర్వులు జారీ చేశారు. ఈ విషయం విద్యుత్ శాఖ డీఈ రవి ప్రసాద్‌ను వివారణ కొరగా… అధికారులను సస్పెండ్ చేస్తు ఉన్నతాధికారులు ఉతర్వులు జారీ చేశారని పేర్కొన్నారు.