బూర్గంపహాడ్, ఆగస్టు 10 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంఘ జెండాను ముఖ్య అతిధిగా హాజరైన తురకకాశ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తురకకాశుల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, యువత అభివృద్ధికి అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. సంఘం అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బికారి, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ కరీం, వర్కింగ్ |ప్రెసిడెంట్ షేక్ జమాల్, సలహాదారులు సయ్యద్ జాన్పాషా, బూర్గంపహాడ్, అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల అధ్యక్షులు మౌలానా షేక్ అజీజ్, షేక్ కరీం, షేక్ లాలు, పటాన్ నాగుల్‌మీరా, యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ కరీముల్లా, సయ్యద్ హుస్సేన్, షేక్ శంషార్, సంఘ నాయకులు పాల్గొన్నారు.