KTR | చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో.. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటే: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శించారు. రైతులను చెరబట్టారని, పేదల ఇండ్లు కూలగొట్టారని ధ్వజమెత్తారు. రైతుబంధు ఎత్తేశారని, రైతుభీమాకు పాతరేశారని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేశారని, అమ్మవడిని ఆగం చేశారని దుయ్యబట్టారు.
నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కారని చెప్పారు. హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు, ఆశాలను అవమానించారని మండిపడ్డారు. టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించారన్నారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మార్చారని విమర్శించారు. చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటేనని చెప్పారు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుందన్నారు.
పాలన కాదు పీడన
ప్రజల వేదన
అరణ్య రోదనరైతుల చెరబడితిరి
పేదల ఇండ్లు కూలగొడ్తిరిరైతుబంధు ఎత్తేస్తిరి
రైతుభీమాకు పాతరేస్తిరికేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి ..
అమ్మవడిని ఆగం చేస్తిరినిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి
ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరిహామీల… pic.twitter.com/dMqAPFBg3s
— KTR (@KTRBRS) December 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- asha workers
- Congress
- KCR KIT
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

