Parliament winter session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) బుధవారానికి వాయిదా పడ్డాయి (adjourned). సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలేకాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
Lok Sabha adjourned for the day; to meet again at 11 A.M on Wednesday, 27th November.
— ANI (@ANI) November 25, 2024
అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ఎగువ సభను చైర్మన్ ధన్కర్ బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను (waqf bill ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై (Adani bribery case) యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
Rajya Sabha adjourned for the day; to meet again at 11 A.M on Wednesday, 27th November.
— ANI (@ANI) November 25, 2024
Also Read..
Devendra Fadnavi | సీఎంగా ఫడ్నవీస్.. అజిత్ పవార్ మద్దతు..!
PM Modi | దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు.. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
Nana Patole | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి నానా పటోల్ రాజీనామా