Nana Patole | ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ (Maharashtra Congress chief) నానా పటోల్ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు.
కాగా శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు గానూ ఏకంగా.. 233 స్థానాల్లో జయభేరి మోగించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2021లో నానా పటోల్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
Also Read..
PM Modi | దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు.. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు
Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా