PM Modi | రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుర్తు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంట్ (parliament)ను నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారని.. సరైన సమయంలో శిక్ష విధిస్తారని వ్యాఖ్యానించారు.
‘కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నారు. సొంత లబ్ధి కోసం పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారు. సరైన సమయంలో ప్రజలే శిక్ష విధిస్తారు. పార్లమెంట్లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నామన్నారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
#WATCH | Delhi: On #ParliamentWinterSession, PM Narendra Modi says, “The voters of India are dedicated to democracy, their dedication to the Constitution, their faith in the parliamentary working system, all of us sitting in the Parliament will have to live up to the sentiments… pic.twitter.com/30ulGcqAOn
— ANI (@ANI) November 25, 2024
Also Read..
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు
Air Pollution | ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హైదరాబాద్‌లో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్