Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ సభను స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు.
నేటి నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను (waqf bill ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై (Adani bribery case) యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
Also Read..
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు
Sabarimala | శబరిమలకు పోటెత్తిన భక్తులు.. 9 రోజుల్లో రూ.41 కోట్ల ఆదాయం
Air Pollution | ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హైదరాబాద్‌లో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్