Devendra Fadnavi | సీఎంగా ఫడ్నవీస్.. అజిత్ పవార్ మద్దతు..!
Devendra Fadnavi | మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే.
Devendra Fadnavi | మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పుడు సీఎం ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికోసం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavi ), ఏక్నాథ్ షిండే ఇద్దరూ పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం అవుతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహా తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్ పవార్ (Ajit Pawar) మద్దతు తెలిపినట్లు తెలిసింది. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు నెగ్గి విజయాన్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది.
నేడు సీఎం ప్రమాణ స్వీకారం
మరోవైపు నేడు మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. తొలి విడుతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు వీరు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) పార్టీ నుంచి 12, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.
Also Read..
Nana Patole | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి నానా పటోల్ రాజీనామా
PM Modi | దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు.. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

