Parliament Sessions | విపక్షాల ఆందోళన.. లోక్ సభ సోమవారానికి వాయిదా
Parliament Sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం (Manipur issue)పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ (Lok Sabha) సోమవారానికి వాయిదా పడింది.
Parliament Sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం (Manipur issue)పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ (Lok Sabha) సోమవారానికి వాయిదా పడింది.
ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే.. మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరిగి లోక్ సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతిచకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
Also Read..
Varuntej – Lavanya | వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ?
Rohit Sharma | ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
Heavy Rain Alert | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

