Varuntej – Lavanya | వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ?
Varuntej - Lavanya | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం గత నెల 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ జరిపించినప్పటికీ పెళ్లి ఎప్పుడన్న దాని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ - లావణ్య పెళ్లికి ముహూర్తం ( Wedding Date Locked) పెట్టినట్లు తెలుస్తోంది.
Varuntej – Lavanya | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం గత నెల 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఎంగేజ్మెంట్ జరిపించినప్పటికీ పెళ్లి ఎప్పుడన్న దాని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెట్టింట మెగా ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. పెళ్లి ఎప్పుడు అంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ – లావణ్య పెళ్లికి ముహూర్తం ( Wedding Date Locked) పెట్టినట్లు తెలుస్తోంది.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు.. వచ్చే నెల అంటే ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారట. వివాహం ఇటలీలో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి నెల మాత్రమే సమయం ఉండటంతో కాబోయే కొత్త జంట షాపింగ్ కోసం విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ పారిస్ లో పెళ్లి షాపింగ్ లో బిజీగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మరో నెల రోజుల్లో మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.
ఆరేళ్ల కిందట వచ్చిన మిస్టర్ సినిమాలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడినట్లు ఇటీవలే లావణ్య తెలిపింది. ఇన్నేళ్లు వీళ్ల రిలేషన్ ను గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టెయిన్ చేసిన ఈ జంట.. ఇప్పుడు కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవితాన్ని పంచుకోబోతోంది.
Also Read..
Rohit Sharma | ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
Heavy Rain Alert | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Parliament Session | మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

