Rohit Sharma | ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
Rohit Sharma | వెస్టిండీస్ (West Indies) పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 2 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ టీంఇండియా (Team India) మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ (MS Dhoni) ని అధిగమించాడు.
Rohit Sharma | వెస్టిండీస్ (West Indies) పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 2 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఓపెనర్ గా 27 టెస్టుల్లో 2,000 కుపైగా పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాదు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీంఇండియా (Team India) మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ (MS Dhoni) ని అధిగమించాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో ధోనీని దాటి రోహిత్ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఇండియా తరఫున 443 మ్యాచులు ఆడిన రోహిత్.. మొత్తం 17,298 పరుగులు చేశాడు. 42.92 సగటుతో ఈ పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హిట్ మ్యాన్ 52 టెస్టుల్లో 3,620 పరుగులు, 243 వన్డేల్లో 9,825 పరుగులు చేశాడు. 148 టీ20ల్లో 3,853 పరుగులు చేశాడు. దీంతో ఎంఎస్ ధోనీని రోహిత్ అధిగమించాడు. ధోనీ 538 మ్యాచుల్లో 17,266 పరుగులు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ను కూడా రోహిత్ అధిగమించాడు. వార్నర్ 348 మ్యాచుల్లో 17267 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఇక అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ తెందూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తం 664 మ్యాచ్ లు ఆడిన సచిన్.. 34,357 రన్స్ చేశాడు. ఇక టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (500 మ్యాచుల్లో 25,484 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (504 మ్యాచుల్లో 24,064 రన్స్), సౌరవ్ గంగూలీ (421 మ్యాచుల్లో 18,433 రన్స్) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలో ధోనీనీ దాటి రోహిత్ ఐదో స్థానానికి దూసుకెళ్లాడు.
Also Read..
Heavy Rain Alert | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Parliament Session | మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా
Health Tips | డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

