Health Tips | డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
Health Tips | దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
Health Tips | దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
దానిమ్మ.. పండు మొత్తానికి మొత్తం ఆరోగ్యానికి మేలు చేసేదే. తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. ఇందులోని పాలిఫినాల్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలం. కీళ్లనొప్పులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, హైపర్ైగ్లెసీమియా నియంత్రణలో సాయపడతుంది. దానిమ్మ గింజలు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
చాలా ప్రత్యేకం
దానిమ్మ గింజల నూనెలో ప్యూనిసిక్ ఆమ్లం ఉంటుంది. ఇతర పండ్లలో ఇది దొరకదు. ఈ నూనెలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయులు తక్కువగా ఉండే.. మెనోపాజ్ దశలోని మహిళలకు దానిమ్మ గింజల తైలం ఎంతో మంచిది. దానిమ్మ గింజలు మనల్ని అతినీలలోహిత (అల్ట్రా వయోలెట్) కిరణాల నుంచి కాపాడతాయి. అలా చర్మ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, శరీరంలో రోగ నిరోధక శక్తిని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణలో దోహదపడతాయి. చిగుళ్లను బలోపేతం చేయడం, దంతక్షయం ముప్పును నివారించడం ద్వారా దంతాల ఆరోగ్యానికి హామీ ఇస్తాయి.
పరిమితులు
దానిమ్మతో హానికరమైన ప్రభావాలు ఏవీ ఉండవు. కాబట్టి, ఎవరైనానిక్షేపంగా తినొచ్చు. ఇందులో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాంటి చక్కెరలు ఉండటం వల్ల మొదట్లో డయాబెటిస్ రోగులు తినొద్దని చెప్పేవారు. అది అపోహే అని తేలి పోయింది. డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎంత మొత్తంలో తినాలనే విషయంలో డైటీషియన్‌ను సంప్రదిస్తే మంచిది.
సలాడ్లలో..
దానిమ్మతో స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లు, జ్యూస్‌లు, ఫుడ్డింగ్, ఐస్‌క్రీములు లాంటివి తయారు చేసుకోవచ్చు. సలాడ్ కోసం ఏవైనా పండ్లముక్కలతోపాటు దానిమ్మ గింజలను ఒక బౌల్లో తీసుకోవాలి. దానికి చిటికెడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, తాజా పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి తరిగిన కీరదోస ముక్కలు జోడించుకోవాలి. తర్వాత సగం కప్పు యోగర్ట్ కలుపుకోవాలి. యోగర్ట్ మీద మళ్లీ కొన్ని దానిమ్మ గింజలను చేర్చాలి. ఆపైన వాల్నట్స్ వేసుకోవాలి. చివరగా, బౌల్లో ఉన్న పదార్థాలన్నిటినీ బాగా కలుపుకొని సర్వ్ చేస్తే సరి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

