LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) వరించింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) శనివారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అద్వానీకి భారత రత్న దక్కడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని ప్రశంసించారు. ఈ మేరకు అత్యున్నత పురస్కారం దక్కింనదుకు గానూ అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. విభజన సమయంలో భారతదేశానికి వలసవచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు. అక్కడే కళాశాల విద్యను పూర్తి చేశారు. 14 ఏళ్ల వసులోనే ఆర్ఎస్ఎస్లో (1941లో) చేరి రాజస్థాన్ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌లో సభ్యుడిగా చేరారు. పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్, జనరల్ సెక్రటరీ, ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు సహా పలు పాత్రలను నిర్వహించారు.
1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాతి ఏడాది అంటే 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. 1970 వరకూ ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. ఇక 1970లో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989 వరకూ నాలుగు పర్యారాలయు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. 1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు. 1998 – 2004 మధ్య హోం వ్యవహారాల మంత్రిగా, 2002 – 2004 వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఇక 2015లో అద్వానీ భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కొవిడ్, స్వైన్ ఫ్లూ పాజిటివ్
Poonam Pandey | పూనమ్ పాండే బతికే ఉందా..? అంతా పబ్లిసిటీ స్టంటేనా..?