Adah Sharma | ‘ది కేరళా స్టోరీ’తో నటిగా గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించింది ఆదాశర్మ. హారర్, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో దూసుకుపోతున్న ఈ అందాలభామ కొంత విరామం తర్వాత నేరుగా తెలుగులో చేస్తున్న సినిమా ‘సీడీ’. ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ అనేది ఉపశీర్షిక. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కృష్ణ అన్నం దర్శకుడు. ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘చీకటి వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది. నాతోపాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా? మరణంతోపాటు యుద్ధం తప్పదా? నన్ను చంపడానికి వచ్చింది ఎవరు? క్రిమినల్ ఆర్ డెవిల్..’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగింది. ఆదాశర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టే చూపులు.. ఇది హారర్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెబుతున్నవి. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేశ్ విట్టా ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ముద్దుకృష్ణ, కెమెరా: ముత్యాల సతీశ్, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.